AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అలా చేస్తే ఆవేశం రాదా..?

షర్మిలను అరెస్ట్ చేయడంపై విజయమ్మ ఫైర్
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్‌పై వైఎస్ విజయమ్మ స్పందించారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారని, ప్రశ్నించే గొంతుకను అణిచివేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద తాను మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఘటనపై విజయమ్మ మాట్లాడారు. అంతమంది మహిళా పోలీసులు తమ మీద పడుతుంటే ఆవేశం రాదా? అంటూ ప్రశ్నించారు.

‘అంతమంది పోలీసులు నా మీద పడితే ఆవేశం వచ్చింది. నేను కొట్టాలనుకుంటే గట్టిగా కొట్టవచ్చు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటే కోపం రాదా? నేను చిన్నగా అలా అంటే ఏదో కొట్టినట్లు మీడియాలో చూపిస్తున్నారు. కొన్ని ఛానెళ్లు పదే పదే చూపిస్తున్నాయి. అది సరికాదు. ప్రజల సమస్యలపై పోరాడే వారికి మీడియా అండగా ఉండాలి. నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతోంది. ప్రజల కోసం పోరాడే గొంతుకను అరెస్ట్ చేస్తారా? పోలీసులకు చేతనైన పని షర్మిలను అరెస్ట్ చేయడమే. షర్మిల అరెస్ట్‌పై కోర్టును ఆశ్రయిస్తా’ అని విజయమ్మ పేర్కొన్నారు.

ANN TOP 10