AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అవినాష్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కీలక తీర్పు..

మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయకూడదన్న తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. హైకోర్టు ఆదేశాలు దర్యాప్తుపై ప్రభావం చూపిస్తున్నాయన్ని సుప్రీం.. హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సమంజసంగా లేవని ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

ఇదిలా ఉంటే వివేకా హ్యత కేసు గడువును సైతం సుప్రీం పొడిగించింది. జూన్‌ 30వ తేదీ వరకు కేసు గడువును పొడగించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కొట్టేసిన తరుణంలో అవినాష్‌ తరపు న్యాయవాది.. అరెస్ట్‌ను ఒక రోజు వాయిదా వేయాలని సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరారు. అయితే జనవరి 23న సమన్లు చేసిన సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదని, ఇప్పుడీ 24 గంటల కోసం రిలీఫ్‌ ఇవ్వలేమంటూ సుప్రీం తేల్చి చెప్పింది.

ANN TOP 10