వీడియో వైరల్
బెంగళూరు: మైసూర్ వార్షిక చీరల విక్రయం వద్ద చోటుచేసుకున్న ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరులోని మల్లేశ్వరంలో ఓ షాపింగ్ మాల్ లో మైసూర్ సిల్క్ చీర వార్షిక విక్రయం నిర్వహించారు. దీంతో చీరలు కొనడానికి షాపింగ్ మాల్‌కు వచ్చిన కస్టమర్స్‌లో ఇద్దరు మహిళలు ఒక చీర కోసం గొడవపడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు మరొకరు లాగుతూ కొట్టుకుంటుండడంతో అంతా షాకయ్యారు. అక్కడున్న వారు ఇద్దరు మహళలను అడ్డుకోవడంతో గొడువ సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.









