AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ టూర్.. కాషాయ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. తెలంగాణ బీజేపీ చేవెళ్లలో నిర్వహించిన విజయ సంకల్ప సభ సక్సెస్ అవ్వడంతో బీజేపీ శ్రేణులు నూతన ఉత్సాహంలో మునిగితేలుతున్నారు. సభ పేరే విజయ సంకల్పం.. అందుకే పేరుకు తగ్గట్టే అమిత్‌షా సూటిగా చెప్పాలనుకున్నది చెప్పారు. దాంతో, చేవెళ్ల విజయ సంకల్ప సభలో అమిత్‌షా మాట్లాడిన ప్రతి మాటా ఒక్కో తూటాలా పేలింది. కాషాయ శ్రేణులకు విజయోపదేశం చేస్తూనే కేసీఆర్‌ సర్కార్‌పై పంచ్‌ డైలాగులు పేల్చారు అమిత్‌షా.

కేసీఆర్‌ అండ్‌ పరివార్‌ టార్గెట్‌గా ప్రశ్నల వర్షం కురిపించారు. కాషాయ శ్రేణులకు విజయోపదేశం చేస్తూనే కేసీఆర్‌ సర్కార్‌పై పంచ్‌ డైలాగులు పేల్చారు అమిత్‌షా. BRS ప్రభుత్వం అవినీతికూపంలో కూరుకుపోయిందన్న షా.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయం.. బీజేపీ పవర్‌లోకి రావడం పక్కా అన్నారు. ఓవైసీపైనా నిప్పులు చెరిగారు షా. అసలు కేసీఆర్‌ స్టీరింగే.. ఓవైసీ చేతిలో ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. ఇక, TSPSC, టెన్త్‌ పేపర్ల లీక్‌పైనా ప్రశ్నల వర్షం కురిపించారు అమిషా. నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడుకుంటారా అంటూ.. అమిత్ షా కేసీఆర్‌ సర్కార్‌పై చెలరేగిపోయారు.

ANN TOP 10