ప్రముఖ నటుడు అలీ, ఆయన కుటుంబ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ పురస్కరించుకుని చిరంజీవిని కలిశారు.ఈ సందర్భంగా వారు దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు మెగాస్టార్. నటుడు అలీ తనకు ఎంతో ముఖ్యమైన రంజాన్ పర్వదినాన్ని తనతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు చిరంజీవి. అలీ పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని అలీ తెలిపారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని చెప్పారు.












