విజయ సంకల్ప సభకు బీజేపీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది.రేపు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని జరిగే బహిరంగ సభకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జనసమీకరణకు కసరత్తు చేస్తున్నారు. చేవెళ్లలో సభ ఏర్పాట్లను కొండా విశ్వేశ్వరెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు.
పార్లమెంట్ ప్రవాస్ యోజన కింద తెలంగాణలోని అన్నిపార్లమెంట్ నియోజకవర్గాలకు కేంద్రమంత్రులను నియమించింది బీజేపీ. దేశవ్యాప్తంగా ఇదే వ్యూహం అమలులో ఉంది. తెలంగాణలో 17 పార్లమెంటరీ నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్లుగా విభజించి సార్వత్రిక ఎన్నికల వరకు కేంద్రమంత్రిని క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఈ క్రమంలోనే రేపు జరిగే భారీ బహిరంగ సభకు హోం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు కూడా రానున్నారు.









