AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు.తీవ్రమైన నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా.. అధికారులు,ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు. ఎన్నిసార్లు సర్పంచ్ కు ఫిర్యాదు చేసినా.. వినిపించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్డుపై ఖాళీ బిందెలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన వార్డు సభ్యులతో గొడవకు దిగారు. ‘మా సమస్యలేవి సర్పంచ్ కు పట్టవా’ అంటూ నిలదీశారు. తక్షణమే సర్పంచ్, అధికారులు స్పందించి నీటికొరత తీర్చాలని లేదంటే.. పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ANN TOP 10