AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతులను మోసగిస్తున్న “420”

రైతులను మోసగిస్తున్న “420” మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరాకు పది రోజుల్లో పరిహారం ఇస్తామని చెప్పి.. ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రిని నిలదీశారు. కమ్మటి మాటలు పలికిన దొరగారు.. ఇప్పటివరకు రూపాయి విదల్చలేదన్నారు. కేసీఆర్ బుద్ధి తేనెపూసిన కత్తి అని మరోసారి తేలిపోయిందన్నారు. తొలుత 2.28లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని లెక్కలు గట్టి.. చివరకు 1.51లక్షల ఎకరాలు మాత్రమేనని చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టారని ఫైర్ అయ్యారు.

అన్నదాతలను ఆదుకుందామన్న సోయి లేదు కానీ.. మాది కిసాన్ సర్కారు అని పక్క రాష్ట్రాల్లో దొంగ ప్రచారం చేసుకోవడం మాత్రం చేతనైందంటూ ఘాటు విమర్శలు చేశారు. రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పి, నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10 వేలు కాకుండా.. వరి పంటకు రూ.25 వేలు, మిర్చి, మొక్కజొన్న పంటకు రూ.50 వేలు, మామిడికి రూ. 75 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ANN TOP 10