AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బిర్యానీ ప్రియులూ.. ఇది మీ కోసమే..

బిర్యానీ.. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే ఫుడ్. భోజన ప్రియులు బిర్యాని అంటే ఎంతో ఉవ్విళ్లురుతారు. దాదాపు బిర్యానీ అంటే ఇష్టపడని వారే ఉండరూ. ఎంతో ఆశగా హోటల్ కి వెళ్లి .. బిర్యానీ ఆర్డర్ చేసి.. ఆవురావురమంటూ తింటారు. అలాంటి వారికోసమే ఈ అలర్ట్.

బయట పదార్థాలు తినేముందు ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిందే. సాధారణంగా ఇంట్లో పెద్దలు.. బయట తినడానికి ఒప్పుకోరు. అయినప్పటికీ ఈ రోజుల్లో అందరూ బయట ఫుడ్ కే అలవాటుపడుతున్నారు. బయటి ఫుడ్ రుచికరంగా ఉంటుందని..సరదాగా ఉంటుందని.. హోటల్స్ కి వెళ్తుంటారు. కానీ హోటల్‎లలో బిర్యానీ ఫుడ్ ఎలా తయారు చేస్తున్నారు.. ఏం వాడుతున్నారు.. అనేది అస్సలు ఆలోచించరు.  అదే తరహాలో ఓ హాటల్ కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసిన వ్యక్తి.. అది ఎలా తయారు చేస్తున్నారో చూసి ఖంగుతిన్నాడు.

భోజన ప్రియుల ఆసక్తిని, ఆకలిని ఆసరాగా తీసుకున్న కొందరు వ్యాపారులు.. ఫుడ్ తయారీలో కల్తీ పదార్థాలు వాడటమే కాకుండా.. తయారు చేసే విధానంలో పరిశుభ్రత పాటించడం లేదు. కనీస నియమ,నిబంధనలు పాటించకుండా బిర్యానీ తయారు చేస్తున్నారనడానికి సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం.

ఓ వ్యక్తి సిద్దిపేటలోని సోని రెస్టారెంట్‌ లో బిర్యానీ ఆర్డర్ చేశారు. తినడం ప్రారంభించే ముందు ఆ కస్టమర్ బాత్రూంకి వెళ్లగా.. అక్కడే బిర్యానీ రైస్ కడుగుతూ కనిపించారు అక్కడి స్టాఫ్. లెట్రిన్ కమోడ్ పక్కనే రైస్ కడుగుతున్నారు. అది చూసి ఆగ్రహంతో ఊగిపోయిన కస్టమర్.. మేనేజర్ ను పిలిచి చెడా మడా తిట్టాడు. మేనేజర్ ను నిలదీయగా.. మోటర్ కాలిపోయిందని, వాటర్ ప్రాబ్లం ఉందని.. అందుకే బాత్రూంలో రైస్ కడుగుతున్నారని సమాధానామిచ్చారు. దీంతో తప్పు మీది కాదని.. ఇక్కడకు తినేందుకు వచ్చిన కస్టమర్లది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు సదరు వ్యక్తి. ఈ ఉధాంతాన్ని  అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి

చూశారు కదండి.ఇలాంటివి నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. కనీసం పరిశుభ్రత లేకుండా.. ఇష్టరీతిన వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు కారణం ఎవరూ..? చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సెఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు..?  ఏది ఏమైనా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇకనైనా తొందరపడి లొట్టలేసుకుంటూ.. బయటకు వెళ్లి తినేముందు ఒక్కసారి ఆలోచించండి.

ANN TOP 10