తమ రాష్ట్రానికి వస్తే చంపేస్తామంటూ కేరళకు చెందిన కొందరు దుండగులు ప్రధాని మోదీకి బెదిరింపు లేఖ రాశారు.ఈ నెల 24న ప్రధాని మోదీ కేరళలో పర్యటించనున్నారు.రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా బీజేపీ యువజన సంఘాలు నిర్వహించే ‘యువం’ అనే సమావేశంలోనూ ప్రధాని పాల్గొననున్నారు.ఈ క్రమంలోనే ప్రధాని మోదీని చంపేస్తామంటూ లేఖ రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
తమ రాష్ట్రానికి మోడీ వస్తే ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామంటూ కేరళ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి దుండగులు మలయాళంలో లేఖ రాశారు.ఎర్నాకులం వాసి జానీ నడుముత్తమిల్ పేరుతో ఈ లేఖ రావడం గమనార్హం.ఈ బెదిరింపు లేఖతో కేరళ పోలీసులు అలర్ట్ అయ్యారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు రాశారానే దానిపై ఆరాతీస్తున్నారు. ఆ లేఖలో పేర్కొన్న వ్యక్తిని పట్టుకున్నారు.అయితే ఆ లేఖ తాను రాయలేదని.. తన పేరిట ఎవరో పంపిచారని సదరు వ్యక్తి స్పష్టం చేశారు.దీంతో లేఖపై మిస్టరీ వీడలేదు.









