టీ- సేవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ దీక్ష ఏర్పాట్లపై వైఎస్సార్టీపీ పీఏసీ సభ్యులు సమావేశమయ్యారు. గట్టు రామచంద్రరావు, పిట్ట రాంరెడ్డి, నీలం రమేష్, గడిపల్లి కవిత, ఏపూరి సోమన్న ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 26న ఇందిరాపార్క్ వద్ద T- SAVE నిరుద్యోగ దీక్ష ఉంటుందని పిట్ట రాంరెడ్డి తెలిపారు. అఖిలపక్షం అధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన దీక్ష నిర్వహిస్తున్నామని.. కోర్టు ఆదేశాల ప్రకారం దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. బీజేపీ మినహా ఇతర అన్ని పార్టీల అధ్యక్షులను కలిసి మరోసారి మద్దతు కోరుతామని అన్నారు.విద్యార్థి, ప్రజా సంఘాలను సైతం దీక్షకు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగుల పక్షాన పోరాటానికి అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 1.91లక్షల ఉద్యోగాల భర్తీ చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.









