AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కర్నాటకలో, తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వాలే..

తెలంగాణలో అధికారంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
ప్రస్తుతం బీజేపీ టార్గెట్ దక్షిణాది రాష్ట్రాలని స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అక్కడ మరోసారి అధికారంలోకి వచ్చి తమకు ఎదురులేదని చెప్పాలని ఆలోచనలో బీజేపీ ఉంది. ఈ క్రమంలో ఇండియా టుడే నిర్వహించిన కర్ణాటక రౌండ్ టేబుల్ 2023 లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా (Amit Shah) ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రాబోయే కర్ణాటక , తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని అమిత్ షా (Amit Shah) జోస్యం చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల్లో విజయాలతో దక్షిణాదిన బీజేపీ ప్రవేశించబోతుందని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ పై ప్రజలకు నమ్మకం ఉందన్న ఆయన కర్ణాటకలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీకే పట్టం కడతారని అన్నారు. ప్రధాని మోదీ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మేలు చేశాయని అమిత్ షా అన్నారు. కాగా కర్ణాటకలో వచ్చే నెలలో ఎన్నికలు ఉండగా..తెలంగాణలో ఏ ఏడాది డిసెంబర్ వరకు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ నెల 23న తెలంగాణకు రాబోతున్న కేంద్ర హోంమంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్ షా షెడ్యూల్ ఖరారైంది. బహిరంగ సభలో పాల్గొనేందుకు తెలంగాణ వస్తున్న అమిత్ షా(Amit Shah).. అదే రోజు ఆస్కార్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్(RRR) టీమ్‌కు విందు ఇవ్వనున్నారు. వారిని సన్మానించబోతున్నారు.

ANN TOP 10