ముంబయిలో భారీ సెక్స్ రాకెట్ గుట్టు బట్టబయలైంది. వర్ధమాన మోడల్స్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు బయటపెట్టారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ భోజ్ పురి యువనటిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పు ముంబయిలోని అరే కాలనీలో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో వ్యభిచారం జరుగుతోందంటూ ఇటీవల పోలీసులకు సమాచారం అందింది. దీనిపై నిఘా పెట్టిన అధికారులు.. తనిఖీలు నిర్వహించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నటిని పక్కా ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేశారు. వర్ధమాన మోడల్స్‌ను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించుతున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఈ ముఠాతో ఇంకెవరికైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.









