వచ్చే ఎన్నికల్లో పోటీపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని చెప్పారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎంజీయూలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరుద్యోగ దీక్షపై ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. జూన్ మొదటి వారంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర నల్లగొండకు చేరుకుంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.నల్లగొండకు ప్రియాంక గాంధీని తీసుకొస్తానని, నల్గొండకు వచ్చేందుకు ప్రియాంక సముఖంగా ఉన్నట్లు వెంకటరెడ్డి తెలిపారు. అయితే వెంకటరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. పలుమార్లు ప్రధాని మోదీని ఆయన కలవడంతో కాషాయ కండువా కప్పుకుంటారనే వార్తలు గుప్పుమన్నాయి. వెంకటరెడ్డి కాంగ్రెస్‌లో అసంతృప్తిగా ఉన్నారని, జాతీయ స్థాయిలో ఏదైనా కీలక పదవి ఇవ్వాలని ఇటీవల హైకమాండ్ దగ్గర ప్రతిపాదన పెట్టినట్లు టాక్ నడుస్తోంది.









