మునుగోడు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి రేవంత్‌రెడ్డి డబ్బు తీసుకున్నారంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలో బీజేపీ నేత విజయశాంతి స్పందిస్తూ.. అధికార పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిలపై కాకుండా విపక్ష నేతలు పరస్పరం చేసుకునే విమర్శలతో బీఆర్‌ఎస్‌కు మేలు జరుగుతోంది. తమ్ముళ్లు రేవంత్, ఈటల ఒకరిపై ఒకరు కాకుండా ప్రభుత్వంపై పోరాడటం అవసరం అని ఫేసుబుక్‌లో పోస్టు చేశారు.









