దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీదే అధికారమని టైమ్స్ నౌ ఉఈటీజీ రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది. బీజేపీ కూటమికి 292 నుంచి 338 సీట్లు వస్తాయని శుక్రవారం ఆ సంస్థ ప్రకటించింది. కాంగ్రెస్ కూటమికి 106 నుంచి 144 సీట్లు రావచ్చని వెల్లడించింది. ఏపీలో వైఎస్ఆర్ సీపీకి 24 నుంచి 25 సీట్లు వస్తాయని సర్వేలో అంచనా వేశారు. అలాగే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎవరిని ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్నారంటే.. అత్యధికంగా 64% మంది మోడీకే జైకొట్టారు. ఆ తర్వాత రాహుల్ గాంధీకి 13%, కేజ్రీవాల్ కు 12%, నితీశ్ కుమార్ కు 6%, కేసీఆర్ కు 5% మంది ఓటేశారు.









