AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ చేవేళ్ల సభకు కొనసాగుతున్న భారీ ఏర్పాట్లు..

తెలంగాణ బీజేపీ ఏప్రిల్‌ 23న చేవేళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకులు.. జనసమీకరణపై సీరియస్‌ గా ఫోకస్‌ పెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరవుతున్న ఈ సభను సక్సెస్‌ చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే చేవేళ్లలో ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. దగ్గరుండి పార్టీ నేతలు సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
చేవేళ్లకు వెళ్లే దాదాపు అన్ని రహదారుల గుండా బీజేపీ నాయకులు తమ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ చూసినా బీజేపీ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. సభను సక్సెస్‌ చేసి, కార్యకర్తల్లో జోష్‌ నింపాలని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

అమిత్‌ షా షెడ్యూల్‌ ఇదే..
ఏప్రిల్‌ 23న ఆదివారం అమిత్‌ షా సుమారు నాలుగున్నర గంటల పాటు హైదరాబాద్‌ లో గడపనున్నారు.
మధ్యాహ్నం 3. 30 గంటలకు ఢల్లీి నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7. 50 గంటలకు తిరిగి ఢల్లీి వెళ్లనున్నారు.
షెడ్యూల్‌ ప్రకారం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి నోవాటెల్‌ హోటల్‌?కు చేరుకుంటారు. ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న ట్రిపుల్‌ ఆర్‌ మూవీ టీంతో 4 నుంచి 4. 30 గంటల వరకు సమావేశం అవుతారు.
సాయంత్రం 4. 30 నుంచి 5.10 వరకు అక్కడే బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు.
6 గంటలకు చేవెళ్ల సభకు చేరుకొని 7 గంటల వరకు అక్కడే ఉంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 7. 45 కు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 7.50 గంటలకు ఢల్లీి బయలుదేరుతారు.

ANN TOP 10