AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భద్రాద్రి ఈవో సంచలన నిర్ణయం.. భారీగా ఉద్యోగుల బదిలీ

దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఏకకాలంలో 37 మంది ఉద్యోగస్తులను బదిలీలు చేయడం సర్వత్రా సంచలనం రేపుతోంది. ఇటీవలే భద్రాచల దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రమాదేవి అత్యంత దూకుడుగా వ్యవహరిస్తుండటంతో రామభక్తుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నేళ్లుగా ఒకే స్థితిలో కొనసాగుతున్న రామాలయ ఉద్యోగులు ఈవో తీసుకున్న నిర్ణయంతో కంగుతిన్నారు. భద్రాచల దేవస్థానంలోని ప్రధాన విభాగాలలో కీలక మార్పులు చేస్తూ అంతర్గత బదిలీలు చేస్తూ 37 మంది ఉద్యోగులకు నూతన బాధ్యతలను కేటాయిస్తూ ఈవో రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ క్రమంలో దేవాలయంలోని ప్రధాన విభాగాలలో కీలక మార్కులు చేపట్టడమే కాకుండా పలువురు ఉద్యోగులను ఉంచుతూ నూతన బాధ్యతలను సైతం అప్పగించారు. పలువురు ప్రజాప్రతినిధుల అండదండలతో సుదీర్ఘకాలంగా కదలకుండా భద్రాచల రామాలయంలో తిష్ట వేసిన కొందరు ఆడిరదే ఆటగా పాడిరదే పాటగా సాగుతుండేది.

వీరి ఆగడాలు రోజురోజుకీ శృతిమించుతున్న తరుణంలో ఇటీవలే పలువురు రామ భక్తులు భద్రాచల ఆలయ ఉద్యోగుల తీరుపై హైకోర్టును సైతం ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆలయ ఈవో కీలక విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులను అక్కడి నుంచి తప్పించి ప్రాధాన్యత లేని విభాగాలకు కేటాయించడం ప్రస్తుతం భద్రాచల పట్టణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ANN TOP 10