AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భూమి కేటాయింపు చట్టవిరుద్ధం

నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని చట్ట విరుద్ధంగా ఈద్గా నిర్మాణం కోసం కేటాయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ( Telangana BJP Chief Bandi Sanjay) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు (CM KCR) బీజేపీ నేత లేఖ రాశారు.

నిరుద్యోగ యువత భవిష్యత్తు తాకట్టు పెట్టి స్వార్థ రాజకీయాల కోసం ఈద్గా ప్రార్థనల కోసం భూమి కేటాయించడం చట్ట విరుద్ధమన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ఇతర ప్రయోజనాలకు వినియోగించొద్దని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా చించోలిలో ఈద్గాను నిర్మించడం న్యాయ వ్యవస్థను అవమానించడమే అని.. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే అని అన్నారు.

ANN TOP 10