హ్యాట్రిక్ విజయం ఎవరిదో?..
ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ముంబై ఇండియన్స్‌లు మంగళవారం ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలు అందుకోవాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. ఆరంభ మ్యాచుల్లో వరుస ఓటములు చవిచూసిన ముంబై, హైదరాబాద్‌లు ఆ తర్వాత వరుసగా రెండింటిలో విజయం సాధించాయి.
దీంతో ఉప్పల్ మ్యాచ్‌లో రెండు జట్లు కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. సొంత గడ్డపై ఆడుతుండడం హైదరాబాద్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. హ్యారీ బ్రూక్ ఫామ్‌లోకి రావడం సన్‌రైజర్స్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఇక సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు కిందటి మ్యాచ్‌లో రాణించడం ముంబైకి కలిసి వచ్చే అంశమే. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.









