పదో తరగతి పేపర్ లీక్ కేసులో పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. బండి సంజయ్ బెయిల్ రద్దుచేయాలని కోరుతూ.. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.బండి సంజయ్ పోలీసుల విచారణకు సహకరించడం లేదని..బెయిల్ రద్దు చేయాలని స్పెషల్ పీపీ సత్యనారాయణ హనుమకొండ ఫోర్త్ ఎంఎం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ను హన్మకొండ జిల్లా కోర్టు తిరస్కరించింది. అదేవిధంగా ఈ కేసులో ఏ6, ఏ9 నిందితుల బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. నిందితుల బెయిల్ పిటిషన్ లపై తీర్పు రేపటికి వాయిదా వేసింది.









