AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెట్టిన చేతిని కొట్టారు..ఏలేటిపై అద్దంకి తీవ్ర విమర్శలు

ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి బీజేపి చేరికపై పీసీసీ జనరల్‌ సెక్రటరీ అద్దంకి దయాకర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెట్టిన చేతిని కొట్టినట్టు మహేశ్వర్‌ రెడ్డి వ్యవహరించారని విమర్శించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్‌ జైభారత్‌ సత్యాగ్రహ సభలో ఆయన పాల్గొన్నారు. సత్యాగ్రహ సభ వేదికగా ఏలేటి మహేశ్వర్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.ప్రజారాజ్యం పార్టీ నుండి వచ్చిన ఏలేటిని.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ గా నియమించారని..పదవులు ఇచ్చి గౌరవించిన కాంగ్రెస్‌ పార్టీని వీడడం చాలా బాధాకరమని తెలిపారు. వందమంది మహేశ్వర్‌ రెడ్డిలు వెళ్లినా.. కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పారు.

ANN TOP 10