AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లిక్కర్‌ స్కాంలో సిసోడియా కస్టడీ పొడిగింపు

దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారిన లిక్కర్‌ స్కాంలో మనీశ్‌ సిసోడియా కస్టడీ పొడిగించింది కోర్టు.జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది.సీబీఐ కేసుకు సంబంధించి జ్యుడీషియల్‌ కస్టడీని ఏప్రిల్‌ 27వ తేదీ వరకు,ఈడీ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 29వ తేదీ వరకు పొడిగించింది.ఇక ఇదే కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ను కూడా సీబీఐ తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది.

లిక్కర్‌ స్కాం కేసులో సీబీఐ ఫిబ్రవరి నెలలో సిసోడియాను అరెస్ట్‌ చేసింది.అంతకుముందు పలుమార్లు విచారించిన అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంది. విచారణకు ఆయన సహకరించడం లేదని, సరైన సమాధానాలు చెప్పడం లేదని చెబుతూ, ఆయన ముందు సాక్ష్యాలు పెట్టి విచారించినప్పటికీ సరైన సమాధానం చెప్పడం లేదని చెబుతూ సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఆ తర్వాత మార్చి నెలలో ఈడీ మనీలాండరింగ్‌ కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంది. ఆయనను ఈడీ తీహార్‌ జైల్లో విచారించింది.

ANN TOP 10