AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అవినాష్‌ ను అరెస్ట్‌ చేస్తారా..సీబీఐకి హైకోర్టు ప్రశ్న

కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై హైకోర్టులో వాదనాలు కొనసాగుతున్నాయి. విచారణకు వస్తే అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేస్తారా అని హైకోర్టు సీబీఐని ప్రశ్నించగా.. అవసరమైతే అరెస్టు చేస్తామని సీబీఐ తెలిపింది. భాస్కర్‌ రెడ్డి పిటిషన్‌ హైకోర్టు విచారణలో ఉండగానే ఆయన్ను అరెస్ట్‌ చేశారని అవినాశ్‌రెడ్డి తరపు లాయర్‌ వాదనలు వినిపించారు. భాస్కర్‌ రెడ్డి పిటిషన్‌పై ఎలాటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని హైకోర్టు స్పష్టం చేసింది. అవినాశ్‌ రెడ్డి సహ నిందితుడని ప్రచారం జరుగుతోందని అవినాష్‌ రెడ్డి తరుపు లాయర్‌ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అసలు హంతకులు ఎవరో తేల్చడం లేదని చెప్పారు. రాజకీయ కోణంలో అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డిలను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని కోర్టుకు లాయర్‌ తెలిపారు.

ANN TOP 10