AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తాళాలేవి..? స్ట్రాంగ్‌ రూం కీస్‌ మిస్సింగ్‌ పై సీఈసీ విచారణ

జగిత్యాల జిల్లా ధర్మపురి స్ట్రాంగ్‌ రూం తాళాలు మిస్సింగ్‌ పై సీఈసీ విచారణ చేపట్టింది.కొడిమ్యాల మండలం జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో మూడు గంటలుగా కేంద్ర ఎన్నికల సంఘ అధికారి విచారణ చేస్తున్నారు. కీస్‌ దొరక్కపోవడంపై జిల్లా అధికారులను ప్రశ్నిస్తున్నారు. తాళాలు ఏమయ్యాయి అనే దానిపై అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలిస్తుంది. 2018 ఎన్నికల సమయంలో జగిత్యాల కలెక్టర్‌ గా శరత్‌ ఐఏఎస్‌ విధులు నిర్వహించారు. ఆయన తర్వాత రవి బాధ్యతలు తీసుకోగా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో జగిత్యాల కలెక్టర్‌ గా యాస్మిన్‌ బాష నియమితులుయ్యారు. అధికారులు చెప్పిన వివరాల ఆధారంగా ఎన్నికల అధికారి హైకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు.

ANN TOP 10