AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉన్నమాట అంటే ఉలుకెందుకు?:హరీష్‌ రావు

ఏపీ మంత్రులకు హరీష్‌ రావు కౌంటర్‌

ఆంధ్యప్రదేశ్‌ మంత్రులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీష్‌ రావు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకుని.. అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలను,మంత్రులను ఉద్దేశించి తాను ఏం తప్పుగా మాట్లాడలేదని తెలిపారు.సిద్దిపేట జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ మంత్రులు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తను ప్రత్యేక హోదా,విశాఖ ఉక్కు విషయంలో ఏపీ ప్రజల తరుపు మాట్లాడితే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు.విశాఖ హోదా కోసం ఎందుకు పోరాడట్లేదని.. పోలవరం ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి కావట్లేదని మంత్రులను నిలదీశారు.

పక్క రాష్ట్రాలతో పోల్చుకునే హక్కు తమకు ఉందని.. పోల్చుకున్నామనే కారణంతో విమర్శించడం సరికాదని హరీష్‌ రావు తెలిపారు. ఏపీ కంటే తెలంగాణలో పథకాలు బాగున్నాయని చెప్పానని.. అంతేకానీ ఎవరినీ కించపరచలేదని హరీష్‌ రావు వెల్లడిరచారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి పాటుపడ్డ ప్రతీ ఒక్కరు తెలంగాణ బిడ్డలే అని హరీష్‌ రావు వెల్లడిరచారు. ఏపీ నాయకులకు చేతనైతే పోలవరాన్ని పూర్తి చేసి, కాళేశ్వరం లాగా పంటలకు నీళ్లు అందించాలని మంత్రులకు సవాల్‌ చేశారు హరీష్‌.

ANN TOP 10