AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అవినాష్‌ రెడ్డికి సీబీఐ మరో నోటీసు

కడప ఎంపీ వైస్‌ అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణ వాయిదా పడిరది. అవినాష్‌ రెడ్డి రేపు విచారణకు రావాల్సిందిగా సీబీఐ అధికారులు తెలిపారు.ఈ మేరకు ఆయనకు మరో నోటీసు ఇచ్చారు. రేపు ఉ.10:30ని.కు విచారణకు రావాలని లేఖలో పేర్కొన్నారు. అవినాష్‌ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు. మరికాసేపట్లో ఆ పిటిషన్‌ విచారణ జరగనుంది.కోర్టు తీర్పు తర్వాతే సీబీఐ విచారణకు వెళ్తానని అవినాష్‌ రెడ్డి తెలిపారు.ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు రేపటికి విచారణ వాయిదా వేశారు.సీబీఐ అధికారులు సీఆర్పీసీ నోటీసులిచ్చి.. విచారణకు పిలిచి అరెస్టు చేస్తున్నారని ఆవినాష్‌ రెడ్డి తరుపు లాయర్‌ తెలిపారు. వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని కూడా అలాగే అరెస్టు చేశారని ఆరోపించారు.

ANN TOP 10