మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించింది కాంగ్రెస్.రాహుల్ గాంధీ టీం పొంగులేటి ఇంటికి చేరుకుని చర్చిస్తున్నారు.కాంగ్రెస్ లో చేరేందుకు పొంగులేటి పలు షరతులు పెట్టినట్లు తెలుస్తోంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన అనుచరులకు పది సీట్లు ఇవ్వాలని అడిగినట్టు తెలుస్తోంది.మధిర తప్పా.. మిగతా చోట్ల సీట్లు ఇచ్చేందుకు రాహుల్ టీం పొంగులేటికి భరోసా ఇచ్చినట్టు సమాచారం. అయితే పొంగులేటి షరతులపై భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.ముందు పార్టీలో చేరాక.. తర్వాత సీట్ల కేటాయింపుపై చర్చించాలని కాంగ్రెస్ శ్రేణులు అన్నట్టు సమాచారం.









