వైఎస్ వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ… తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సోమవారం నాడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ.. ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. హైదరాబాద్ ఆఫీసులో అవినాష్ రెడ్డిని ప్రశ్నించనుంది సీబీఐ.









