AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసలు లిక్కర్ స్కాం అనేదే లేదు.. అంతా అబద్ధం:కేజ్రీవాల్

లిక్కర్ కేసు ముమ్మాటికి తప్పుడు కేసే: కేజ్రీవాల్
ఆప్ ను అంతం చేయడానికి కేంద్రం కుట్ర చేస్తుంది:కేజ్రీవాల్

సీబీఐ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దాచి పెట్టాల్సిన విషయాలేమి లేవని చెప్పారు. చావనైనా చస్తాం కానీ.. నిజాయితీని వదులుకోమని తెలిపారు. సీబీఐ విచారణ అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐ అధికారులు తనను 56 ప్రశ్నలు అడిగారని.. ముమ్మాటికి ఇది తప్పుడు కేసేనని తెలిపారు. కుట్రతోనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. ఒక్క ఆధారం లేకుండా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరిస్తుందని.. అందుకే తమపై కేంద్రం కక్ష కట్టిందని.. ఆప్ ను అంతం చేయడానికి కుట్ర చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా రేపు ఢిల్లీ అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉండగా ఢిల్లి లిక్కర్ స్కాంలోసీబీఐ అధికారులు కేజ్రీవాల్ ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. న్యూ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి దాదాపు 9 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలు, కమీషన్ రేట్లను పెంచడం, సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీష్ సిసోడియా సహా గ్రూప్ ఆప్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్‌తో సంబంధాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.

ANN TOP 10