మంత్రి గంగుల కమలాకర్ పెను ప్రమాదం తప్పింది. చెర్లబూట్కూరులో ఓ కార్యక్రమానికి వెళ్లిన మంత్రి గంగుల ప్రమాదానికి గురయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదిక ఒక్క సారిగి కూలిపోవడంతో.. వేదికపై ఉన్న గంగుల, ఇతర నేతలు అంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.ఈ ప్రమాదంలో మంత్రికి స్వల్ప గాయాలయినట్టు సమాచారం. అలాగే ఓ జడ్పీటీసీ కాలు విరగడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే సభా వేదిక పైకి పరిమితికి మించి నాయకులు ఎక్కడంతోనే వేదిక కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.









