AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉస్మానియాలో వైఎస్ భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన అధికారులు.. ఆయనను కట్టుదిట్టమైన భద్రత మధ్య పులివెందుల నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. సీబీఐ కాన్వాయ్ కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ చేరుకుంది. భాస్కర్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు.ఈ నేపథ్యంలో, వైద్య పరీక్షల నిమిత్తం భాస్కర్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కోర్టు రిమాండ్ విధిస్తే భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.

ANN TOP 10