సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.మధ్యవర్తిత్వానికి క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పారు. హైదరాబాద్ ఐఏఎంసీలో ఏర్పాటు చేసిన ఇండియా మీడియేషన్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటి ఇండియా మీడియేషన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
పూర్వకాలం నుంచే మధ్యవర్తిత్వం ఉందని.. కౌరవులు, పాండవుల మధ్య కృష్ణుడి మధ్యవర్తిత్వం విఫలం వల్లే మహాభారత యుద్ధం జరిగింది’’ అని చెప్పారు.ఆర్థిక సంస్కరణల కారణంగా మధ్యవర్తిత్వ ప్రాధాన్యం భారత్‌లోనూ పెరిగిందని తెలిపారు.అయితే ఈ ప్రక్రియ వేగవంతంగా, విశ్వసనీయతతో సాగాలని అభిప్రాయపడ్డారు. ఉభయపక్షాలకు ఉపయోగకరంగా సాగాలని సూచించారు.
హౖదరాబాద్‌లో మీడియేషన్ కేంద్రం ఏర్పాటుపై తాను, జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎన్నోసార్లు చర్చించుకున్నామని చెప్పారు. మొదట్లో తాను చిన్న స్థాయిలో కేంద్రం ఏర్పాటు చేద్దామనుకున్నానని తెలిపారు. కానీ.. జస్టిస్ నాగేశ్వరరావు దాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారని, జస్టిస్ హిమకోహ్లి కూడా ఎంతో సహకరించారని వెల్లడిరచారు.
న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం ఓ కీలకమైన అంశమని జస్టిస్ హిమకోహ్లి అన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రధాన పాత్ర వహిస్తుందన్నారు. చోళుల కాలంలోనూ మధ్యవర్తిత్వం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేదని చెప్పారు.హైదరాబాద్‌లోని మీడియేషన్ కేంద్రం చూసి ఆశ్చర్యపోయానని జస్టిస్ రవీంద్రన్ అన్నారు. కోర్టు వివాదాల వల్ల ఎంతో సమయం, డబ్బు వృథా అవుతాయని.. వందల కోట్లతో ముడిపడిన సమస్యలు కూడా మీడియోషన్ వల్ల రోజుల వ్యవధిలోనే పరిష్కరించవచ్చని తెలిపారు.









