తల్లి పాలే బిడ్డకు అమృతం:కిషన్ రెడ్డి
తల్లి పాలే బిడ్డకు వైద్యం,ఆహారమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తల్లి పాలు బిడ్డకు అమృతం లాంటివని.. పిల్లల ఆరోగ్యమే తల్లులకు మహాభాగ్యమని తెలిపారు.అంబర్‌పేట్ నియోజకవర్గంలోని బాగ్ అంబర్‌పేట్‌లో హెల్తీ బేబీషో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై.. శిశువుల ఆరోగ్యం,తల్లిపాల ప్రాముఖ్యత గురించి మాట్లాడారు.
దేశంలోని ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో హెల్తీ బేబీ షో కార్యక్రమం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారన్నారు.3 నుంచి 13 నెలల పసిపిల్లలతో హెల్తీ బేబీ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పిల్లలను తల్లులు ఎంతో పోటీ తత్వంతో పెంచుతున్నారన్న కిషన్ రెడ్డి.. ఇది చాలా మంచి పరిణామమన్నారు.కొందరు తల్లులు పిల్లలకు డబ్బా పాలు ఇస్తారని.. అయితే తల్లి పాలే పిల్లలకు అమృతమన్నారు.తల్లి పాల వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారన్నారు.
ప్రభుత్వం,సమాజం తరపున తల్లిపాలను ప్రోత్సహించడానికే ఈ కార్యక్రమం తీసుకొచ్చామని చెప్పారు.‘బేటీ బచావ్, బేటీ పఢావ్’ కార్యక్రమంలో భాగంగా బాలికల ఆరోగ్యంతో పాటు భ్రూణహత్యలను సైతం తగ్గించారని.. దీంతో నేడు దేశవ్యాప్తంగా మగపిల్లలతో పాటు ఆడపిల్లల సగటు రేటు పెరిగిందని చెప్పారు.









