బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.కల్వకుంట్ల కుటుంబంది కచరా పాలన అని ఎద్దేవ చేశారు. బీజేపీ మంత్రం- నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్. కానీ బీఆర్‌ఎస్ నినాదం- కుటుంబం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పీపుల్ లాస్ట్ అని సంజయ్ సెటైర్లు వేశారు.ఇది కవిత, కేసీఆర్, కేటీఆర్ కచరా పాలనకి నమూనా అన్నారు. గత 9 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే ధనవంతులయ్యారని.. పేదలు, నిరుద్యోగులు మాత్రం కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. ఇక ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో మాత్రమే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని బండి సంజయ్ తెలిపారు.










