AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పోలీసుల వేధింపులకు నిరసనగా ఈటల ధర్నా

పోలీసుల వేధింంపులు, అక్రమ కేసులకు నిరసనగా హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ధర్నాకు దిగారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి.. అనంతరం ధర్నా నిర్వహించారు.
బీ.చెల్పూర్‌ గ్రామ సర్పంచ్‌ నేరేళ్ళ మహేందర్‌ గౌడ్‌, వార్డు మెంబర్‌ మహ్మద్‌ ఇబ్రహీమ్‌ పై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని ఈటల తెలిపారు.థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా హింసించారని.. హుజురాబాద్‌ సీఐ బొల్లం రమేష్‌ పై చర్యలు తీసుకుని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.పొలీసులు బీఆర్‌ఎస్‌ కు తొత్తులుగా వ్యవహరిస్తూ ..బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. ఇకనైనా పోలీసులు తమపై వేధింపులు మానుకోవాలని హెచ్చరించారు.

ANN TOP 10