చీమలపాడు ఘటనలో కాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్
ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్నిప్రమాద ఘటనలో తీవ్ర గాయాలై.. కాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ దావా నవీన్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు.ఖమ్మం నగరంలోని సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవీన్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు.పూర్తిగా కోలుకునే వరకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని, దైర్యం కోల్పోవొద్దని చెప్పారు. ఇప్పటికే మంత్రి, పోలీస్ కమిషనర్ తో మాట్లాడామని.. ప్రభుత్వం తరుపున పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఎలాంటి వైద్య సేవలైన తక్షణమే అందించాలని, పూర్తిగా కోలుకునేవరకు మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులను ఆదేశించారు