రేపు టీ సేవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తలపెట్టిన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్ సమస్యతో అనుమతి ఇవ్వలేమని అధికారులు తెలిపారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో తదుపరి కార్యాచరణపై షర్మిల పార్టీ ముఖ్యనేతలతో చర్చిస్తున్నారు.హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవడమా..? లేక పార్టీ కార్యాలయ వద్ద దీక్ష కొనసాగించాలా అనే దానిపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.కాగా ఇందిరా పార్కులో అఖిల పక్ష నేతలతో కలిసి దీక్ష చేయాలని షర్మిల అనుకున్నారు.ఈ మేరకు దీక్షకు అనుమతి ఇవ్వాల్సిందిగా షర్మిల పోలీసులను కోరారు. లా అండ్ ఆర్డర్ అధికారులను అనుమతి కోరారు.









