AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం: నలుగురు మృతి

హైదరాబాద్: కుషాయిగూడ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. టింబర్‌ డిపోలో మంటలు అంటుకుని నలుగురు సజీవదహనం (Four were Burned Alive) అయ్యారు. పక్కన ఉన్న ఇండ్లకు మంటలు విస్తరించాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై రోడ్లమీదకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతులు వరంగల్‌ జిల్లాకు చెందిన నరేష్‌, సుమ, బాబుతో పాటు మరో కార్మికుడుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదే చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

ANN TOP 10