AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వంటింటికి ‘వార్’ దెబ్బ: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ తీవ్ర కొరత!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు భారతీయ గృహాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ ఆధీనంలోని హర్మూజ్ జలసంధి మూసివేత మరియు ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ఖతార్ నుంచి ఎల్‌ఎన్జీ (LNG) సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది.

వంట గ్యాస్ కొరత కారణంగా సిలిండర్ బుకింగ్ వ్యవధిని గతంలో ఉన్న 21 రోజుల నుండి 25 రోజులకు పెంచారు. ప్రభుత్వం గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, వాణిజ్య సిలిండర్ల సరఫరా దాదాపు నిలిచిపోవడంతో హోటల్ పరిశ్రమ కుదేలైంది. ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైలలో వాణిజ్య గ్యాస్ అందక సుమారు 25 శాతం హోటళ్లు మూతబడ్డాయి. ఇది పరోక్షంగా లక్షలాది మంది ఉపాధిపై దెబ్బకొడుతోంది.

మార్కెట్‌లో గ్యాస్ కొరతను సాకుగా చూపి కొందరు వ్యాపారులు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని (ESMA) అమలు చేయాలని నిర్ణయించింది. చమురు శుద్ధికర్మాగారాలు ఉత్పత్తిని 10 శాతం పెంచినప్పటికీ, దేశీయ అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో సామాన్యుడికి ఇప్పట్లో గ్యాస్ కష్టాలు తప్పేలా లేవు.

ANN TOP 10