- జనం నుంచి వనం కు వన దేవతలు
- ముగిసిన మేడారం మహా జాతర ప్రస్థానం
- వన ప్రవేశం చేసిన సమ్మక్క, సారలమ్మ
వరంగల్ మహా;
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర ప్రస్థానం శనివారం తో ముగిసింది. అయినప్పటికీ భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర శనివారం తల్లుల వనప్రవేశం తో మహా జాతర ముగిసింది. శనివారం సాయంత్రం గద్దెల ను పరిశుభ్రం చేసి, గిరిజన గంటల సమయంలో వన దేవతల వన ప్రవేశం పూజారులు అమ్మవార్లకు సంప్రదాయ పూజలు నిర్వహించారు. రాత్రి 7 ప్రారంభమయింది. సమ్మక్క తల్లిని చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి
ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజు లను ఏటూరు నాగారం మండలం కొండాయ్ గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. దేవతల వనప్రవేశంతో మేడారం మహా జాతర ముగిసింది.
తగ్గని భక్తుల తాకిడి
వనదేవతలు వనప్రవేశం చేసినప్పటికీ మేడారం ఇంకా భక్తులతో కిటికిటలాడుతోంది. మహా జాతర ముగుస్తున్న తరుణంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి వన దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్నారు.
సమ్మక్క సారలమ్మలకు చీర, సారె, ఒడిబియ్యం పోసి దేవతలను మనసారా కొలుచుకుంటున్నారు. తోపులాటలు, క్యూలైన్లలోనే గంటల సేపు పడిగాపులు పడినా లెక్క చేయకుండా అమ్మవార్ల దర్శనాలు చేసుకున్నారు. క్యూలైన్ల వద్ద మరింత పటిష్టంగా బందోబస్తు నిర్వహించాలని భక్తుల అభిప్రాయపడ్డారు. మేడారంలో దర్శనాలు మాత్రం నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ వనప్రవేశం అనంతరం కూడా భక్తులు భారీగా తరలివచ్చి సమ్మక్క సారలమ్మ లకు మొక్కులు చెల్లించు కుంటున్నారు.









