రియల్‌మి కంపెనీ తన నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ ‘రియల్‌మి P4 పవర్ 5G’ని జనవరి 29, 2026న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ 10,001mAh ‘టైటాన్’ బ్యాటరీ. సాధారణ స్మార్ట్‌ఫోన్‌లలో 5,000mAh లేదా 6,000mAh బ్యాటరీ ఉండగా, రియల్‌మి ఏకంగా 10వేల ఎంఏహెచ్ బ్యాటరీని పరిచయం చేస్తూ ‘గేమ్ ఛేంజర్’గా నిలవనుంది. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ బరువు సుమారు 219 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం.
ఫీచర్ల విషయానికొస్తే, ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు చేసే 1.5K రిజల్యూషన్ హైపర్‌గ్లో 4D కర్వ్+ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో పాటు మెరుగైన గేమింగ్ మరియు ఇమేజింగ్ కోసం ప్రత్యేకంగా ‘హైపర్ విజన్+ ఏఐ’ చిప్‌ను అమర్చారు. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది, తద్వారా భారీ బ్యాటరీని కూడా త్వరగా ఛార్జ్ చేయవచ్చు. ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP OIS మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ మరియు ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
ధర విషయానికి వస్తే, లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్ రిటైల్ బాక్స్ (MRP) ధర 12GB+256GB వేరియంట్ కు రూ. 37,999 గా ఉంది. అయితే, లాంచ్ ఆఫర్లు మరియు మార్కెట్ ధర ప్రకారం ఇది రూ. 30,000 నుంచి రూ. 35,000 మధ్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ ట్రాన్స్‌సిల్వర్, ట్రాన్స్‌ఆరెంజ్, ట్రాన్స్‌బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ఇది ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ ద్వారా విక్రయించబడనుంది.









