AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ఆర్టీసీకి కాసుల పంట

దసరా, బతుకమ్మ పండగలు సందర్భంగా సంస్థకు భారీగా ఆదాయం వచ్చిందని తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. సంస్థకు రూ.307.16 కోట్ల మేర ఆదాయం వచ్చిందని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 707.73 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారన్నారు. దాంతో పండగల వేళ.. సాధారణంగా నడిచే బస్సు సర్వీసులే కాకుండా.. అదనపు సర్వీసులను సైతం తెలంగాణ ఆర్టీసీ నడిపిందని చెప్పారు. దాదాపు 10,513 బస్సులను అదనంగా నడిపామని ఉన్నతాధికారులు వివరించారు.

బతుకమ్మ, దసరా పండగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, సంతోష్ నగర్ నుంచి పలు ప్రాంతాలకు బస్సులను నడిపింది.

ANN TOP 10