AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్లపై మంత్రుల సమావేశం.. నేడు కీలక ప్రకటన?

గ్రూప్ 1 అభ్యర్థుల నిరసనలు తీవ్రమైన వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించింది. శనివారం రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో పలువురు మంత్రులు సమావేశమయ్యారు. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి అభ్యర్థులు లేవనెత్తుతున్న డిమాండ్లు, సమస్యలు, పరీక్షలు, జీవో 29 తదితర అంశాలపై మంత్రులు చర్చిస్తున్నారు. అభ్యర్థులు నష్టపోకుండా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అభ్యర్థుల వినతులు, డిమాండ్లు వాటి సాధ్యాసాధ్యలపై భేటీలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ భేటీలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆదివారం గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.

వారిని నమ్మొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లపాటు ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేసిందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఇప్పుడేమో పోటీ పరీక్షలను వాయిదా వేయాలని అంటోందని అన్నారు. పోలీసు డ్యూటీ మీట్ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి యథాతథంగా జరుగుతాయని CM రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘పరీక్షలకు సిద్ధం కండి. 95శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మరో 5శాతం మంది డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిపక్షాల మాయమాటలను నమ్మకండి. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మేం వచ్చాకే వేల ఉద్యోగాలు కల్పిస్తున్నాం’ రేవంత్ పేర్కొన్నారు.

ANN TOP 10