AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి కొండా సురేఖ కేసులో నేడు నాంపల్లి కోర్టుకు కేటీఆర్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఉదయం నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ ఆయనపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా దాఖలైంది. దీంతో ఈ కేసులో స్వయంగా కోర్టుకు హాజరుకానున్న కేటీఆర్, ఉదయం 11.30 గంటలకు న్యాయస్థానంలో స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. సాక్ష్యులుగా బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, తుల ఉమ, బాల్క సుమన్, దాసోజు శ్రవణ్ సైతం వాంగ్మూలం ఇవ్వనున్నారు.

దీంతో పిటిషన్‌పై ఈనెల 14న కోర్టు విచారించింది. అనంతరం 18కి వాయిదా వేసింది. ఇక కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలు శుక్రవారం నమోదు చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు రేపు కోర్టులో హాజరవుతారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టులో సమర్పించారు.

ANN TOP 10