AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆదిలాబాద్ కు నిధుల వరద.. కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ

ముఖ్యమంత్రి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి రూ.4కోట్లు విడుదల

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపిన  కంది శ్రీనివాసరెడ్డి

ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తితో నిధులు మంజూరు

ఇప్పటికే రూ.10కోట్లు మంజూరుచేసిన మంత్రి సీతక్క

ఆదిలాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో సీఎం రేవంత్ కు, మంత్రి సీతక్కకు, కంది శ్రీనివాస రెడ్డి కి పాలాభిషేకాలు

భీంసరిలో  బ్రిడ్జి మంజూరు చేయించిన కంది శ్రీనివాసరెడ్డి

(అమ్మన్యూస్‌, ఆదిలాబాద్‌):
ఆదిలాబాద్ ఇంఛార్జి మంత్రి సీతక్క చొరవతో నియోజక వర్గానికి నిధుల వరద పాతోందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. నిన్ననే సీఆర్ ఆర్ గ్రాంట్ కింద 10 కోట్లు విడుదల కాగా తాజాగా ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద వివిధ 115 పనులకు సంబంధించి 4 కోట్ల రూపాయలు విడుదలైనట్టు తెలిపారు. నియోజక వర్గ ప్రజల కోసం తన విజ్ఞప్తి మేరకు నిధుల విడుదల కు సహకరిస్తున్నజిల్లా ఇంఛార్జి మంత్రి దనసరి సీతక్కకు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంది శ్రీనివాస రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వెనుక బడిన ఆదిలాబాద్ నియోజక వర్గం అభివృద్ధికి మున్ముందు మరిన్ని నిధులు వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు.

ASF_000 (1)

 

ANN TOP 10