ఇదో విచిత్ర సంఘటన.. రీల్ స్టోరీ కాదు.. రియల్ సీన్.. తన భర్తను ఇష్టపడిన ఓ మానసిక వికలాంగురాలికి భార్యే దగ్గరుండి తన భర్తతో వివాహం జరిపించిన విచిత్ర సంఘటన ఇది.. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ పెళ్ళ వేడుక ప్రతి ఒక్కరినీ నివ్వెరపోయేలా చేసింది.. ఆ పెళ్ళికి వచ్చిన అతిధులంతా మొదట ఆశ్చర్య పోయారు.. ఆ తర్వాత పరిస్థితి అర్థం చేసుకొని ఆశీర్వదించారు.. పెద్దమనసు చేసుకున్న భార్య త్యాగాన్ని అభినందించారు. ఈ పెళ్లి వేడుక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో జరిగింది. చిన్న గూడూరు గ్రామానికి చెందిన సురేష్ – సరిత దంపతులకు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. వారి జీవనం సంతోషంగా సాగుతోంది. అయితేూ మహబూబాబాద్ పట్టణానికి చెందిన పద్మ – వీరాస్వామి దంపతుల చిన్నకూతురు సంధ్య సురేష్‌ను తనకు ఉహ తెలిసినప్పటి నుండి ప్రేమిస్తుంది.. ఈ విషయం సురేష్ భార్య సరితకి తెలిసింది.
ఆ మానసిక వికలంగురాలి మనసు అర్థం చేసుకున్న సరిత పెద్దమనసు చేసుకుంది.. తన భర్తకు సంధ్యతో మళ్ళీ పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంది. అంతేనా.. నా భర్తకు మళ్లీ పెళ్లి… మీరంతా రావాలి మళ్ళీ అని బంధుమిత్రులు, కుటుంబ సభ్యులను ఆహ్వానించింది. అతిధులందరి సమక్షంలో మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు నడుమ తన భర్తకి రెండో పెళ్లి అట్టహాసంగా నిర్వహించింది. ఈ వివాహ వేడుకను సురేష్ మొదటి భార్య సరిత.. అంతా తానై జరిపించడం విశేషం. ఈ విచిత్ర వివాహం జిల్లాలో చర్చనీయాంశమైంది.









