AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జగదీశ్‌రెడ్డికి సుప్రీం ఝలక్‌.. బీఆర్‌ఎస్‌ నేత పిటిషన్‌ కొట్టివేత

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ఓటుకు నోటు కేసులో బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసు ట్రయల్‌ బదిలీ చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే మన న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్‌ రెడ్డి సీఎం కావడంతో విచారణను భోపాల్‌ కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ట్రయల్‌ పై పూర్తి అనుమానాలు ఉన్నాయని, కేసును విచారించే ఏసీబీ (హోంశాఖ) సీఎం పరిధిలో ఉందని పిటిషనర్‌ తరపు లాయర్‌ వాదించారు. ప్రభుత్వ కౌంటర్‌ అఫిడవిట్‌ లో వైఖరి మారిందని జగదీశ్‌ రెడ్డి న్యాయవాది వాదించారు.

జగదీష్‌ రెడ్డి దాఖలు చేసిన బదిలీ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణను ముగించింది. ట్రయల్‌ జరిగే విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌ని నియమిస్తామని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘మా న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కరి మనస్సులో విశ్వాసం ఉండేలా, మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తాం’ అని జస్టిస్‌ గవాయ్‌ అన్నారు.

పిటిషన్‌ కొట్టివేత..
పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని.. పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నామని త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది. కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘మా న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కరి మనస్సులో విశ్వాసం ఉండేలా, మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తాం’ అని జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు. తెలంగాణకు చెందిన తమ సహచరులను సంప్రదించి ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని జస్టిస్‌ గవాయి వెల్లడించారు. పిటిషన్‌ పై విచారణను త్రిసభ్య ధర్మాసనం ముగించింది. స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌ని సుప్రీంకోర్టు నియమిస్తుందని ధర్మాసనం వెల్లడించింది.

ANN TOP 10