AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ, అదనపు బాధ్యతలు

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించింది. హెచ్‌ఎండీఏ, మూసీ అభివృద్ధి, హెచ్‌జీసీఎల్‌ అదనపు బాధ్యతల నుంచి ఆమ్రపాలిని ప్రభుత్వం రిలీవ్‌ చేసింది.

మూసీ అభివృద్ధి కార్పోరేషన్‌ ఎండీగా దాన కిశోర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ఎండీగా సర్ఫరాజ్‌ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు ఇవ్వగా.. హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ జాయింట్‌ కమిషనర్‌గా కోట శ్రీవాస్తవ, కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా చహత్‌ బాజ్‌పాయ్‌, హైదరాబాద్‌ జలమండలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి మయాంక్‌ మిత్తల్‌ను బదిలీ చేసింది.

ANN TOP 10