AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పిసిసి అధ్యక్షపదవికి అసలైన అర్హుడిని.. అమ్మన్యూస్ తో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్

స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి బంజారాలకు ఇచ్చే అవకాశం వచ్చింది

బంజారాలకు కాంగ్రెస్ పై ఉన్న నమ్మకం నిలపాలి

నేను సోనియాకు వీరవిధేయుడిని.. అధిష్టానం నియమించిన రేవంత్ రెడ్డికి విధేయుడిని

తెలంగాణ కోసం పోరాడిన ఎంపీలను కేసీఆర్ అవమానించారు

కేటీఆర్ జబర్దస్త్ ఆర్టిస్ట్ గా ప్రవర్తిస్తున్నాడు

మహిళలంటే కేటీఆర్ కు గౌరవం లేదు

హరీష్ రాజీనామా చేయాల్సిందే

తెలంగాణ ప్రభుత్వం అద్భుత పరిపాలన అందిస్తోంది

ప్రజలు..ప్రజాస్వామ్యవాదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను అభినందిస్తున్నారు

30 వేల ఉద్యోగాలు.. రుణమాఫీ, టీచర్ల బదిలీలు.. ఎనిమిది మాసాల్లోనే ఎన్నో విజయాలు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అద్భుత పథకం

అమ్మన్యూస్ తో కేంద్ర మాజీమంత్రి, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

(హైదరాబాద్, అమ్మన్యూస్)

స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి బంజారాలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే సందర్భం కాంగ్రెస్ కు వచ్చిందని, పార్టీ ప్రయోజనాల రీత్యా కాంగ్రెస్ పార్టీ ఈ సారి పిసిసి అధ్యక్షపదవి తనకు ఇస్తుందన్న నమ్మకం ఉందని కేంద్ర మాజీమంత్రి, మహబూబాబాద్ఎంపీ బలరాం నాయక్ అన్నారు. అమ్మన్యూస్ కు ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనిమిది మాసాల్లోనే ఎన్నో పనులు చేసి, హామీలు నిలుపుకున్నారన్నారు. తెలంగాణ ను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చినా, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు కష్టపడి ఒడ్డుకు చేరుస్తూ కొత్త పథకాలు అమలుచేస్తున్నారన్నారు. తాను మాత్రమే కాదని, తమ జాతి అంతా కాంగ్రెస్ నాయకత్వం ఈసారి బంజారాలకు అవకాశం ఇవ్వాలని గట్టిగా కోరుకుంటున్నదన్నారు. కేబినెట్ లో బంజారాలకు చోటు కల్పించలేదని, పిసిసి చీఫ్ తో ఒక కేబినెట్ పదవిని కూడా బంజారాలకు ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశామన్నారు. సోనియమ్మ తనకు దేవతని, పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలం పేగులు తెగేలా కొట్లాడామన్నారు. అయినా తమ నాయకురాలు మళ్ళీ 2014లో మా అందరికీ టికెట్లు ఇచ్చిందని, తెలంగాణపై సోనియాగాంధీకి ఎంతో ప్రేమ అన్నారు. కేసీఆర్ ఎన్నడూ పార్లమెంట్ కు రాలేదని, తెలంగాణ ఇవ్వాలని పోరాడిన తమను కూడా ఆయన సీఎం అయ్యాక అవమానించారన్నారు. తాను సోనియాగాంధీకి, కాంగ్రెస్ హైకమాండ్ కు వీరవిధేయుడినని, హైకమాండ్ నియమించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కూడా వీరవిధేయుడినేనన్నారు. కేంద్రమంత్రిగా పనిచేసిన తనకు పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసే సామర్ధ్యం ఉందన్నారు.

కేటీఆర్, హరీష్ లపై ఆగ్రహం

కేటీఆర్ మహిళలను అవమానిస్తున్నారని, ఆయనకు మహిళలంటే గౌరవం లేదని ఎంపీ బలరాం నాయక్ అన్నారు. ఆయన జబర్దస్త్ కమెడియన్ లా ప్రవర్తిస్తున్నాడని, మహిళలు బస్సులో ప్రయాణిస్తే బ్రేక్ డ్యాన్స్ లు, రికార్డింగ్ డ్యాన్స్ లు అంటూ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామిక పాలనను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారని, బీఆర్ ఎస్ నాయకులు దీనిని తట్టుకోలేకపోతున్నారన్నారు. 30వేల కోట్ల రుణమాఫీ చేయడం చారిత్రకమని, మాజీమంత్రి హరీష్ రావు ఛాలెంజ్ విసిరి తప్పుకున్నాడన్నారు. తాము హరీష్ కోసం మాఫీ చేయలేదని, రైతుల కోసం చేశామన్నారు. హరీష్ రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందన్నారు. 30వేల ఉద్యోగాలు, టీచర్ల బదిలీలు, మహిళలకు ఉచిత బస్సు, ప్రీ కరెంట్, 500 గ్యాస్ ఇలా ఎన్నో పథకాలు అమలుచేశామన్నారు. ఈ ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తున్నదని, ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనివి కూడా చేస్తామన్నారు.

ANN TOP 10